10 లక్షల మంది మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో ఉన్నాం: జాతీయ సరస్ మేళాలో సీఎం చంద్రబాబు
జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వయం ఏపీ బ్రాండ్ గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
• దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను నిర్వహించటం మరింత శోభ తెచ్చింది.
• సరస్ మేళాను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారీ శక్తికి, నవ భారత శక్తికి ప్రతిరూపం.
• మహిళా శక్తిని చాటేందుకే ఢిల్లీ వెలుపల తొలిసారి విజయవాడలో మహిళల జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నారు.
• గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచటం, మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహించటం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తేవడమే ఈ మేళా లక్ష్యం.
• మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం దేశం ఎదుగుతుంది.
• 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యం.
• నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయి.. ఇవే రేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి.
• ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన డ్వాక్రా పొదుపు ఉద్యమం నేడు దేశంలోనే గర్వించే విజయలను సాధిస్తోంది.
• 11 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవరుతో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు.
• ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయ సంఘాల మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం.
• 5 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నాం.
• 10 లక్షల మంది మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో పని చేస్తాం.
• ఏపీలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్వయం ఏపీ బ్రాండ్ తీసుకువచ్చాం.
• ఈ-కామర్స్, ఆన్ లైన్ షాపింగ్ లో స్వయం ఏపీ పేరుతో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
• సంక్షేమంతో పాటు మహిళలకు భరోసా ఇచ్చేలా వారి సాధికారిత కోసం పనిచేస్తున్నాం
• మహిళా శక్తిని బలోపేతం చేసేలా తల్లికి వందనం ఇస్తున్నాం.
• స్త్రీశక్తితో ఉచిత బస్సు ప్రయాణంతో 100 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు
• సంక్షేమ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమం అయినా మహిళల పేరుతోనే అమలు చేస్తున్నాం
• ప్రతీ మహిళకు వెల్ఫేర్ టు వెల్త్ అందాలనేది మా నినాదం.
• సేవింగ్ మనీ స్థాయి నుంచి మేకింగ్ మనీ స్థాయికి మన ఎస్ హెచ్ జీ బృందాలు అభివృద్ధి చెందాయి.
• దేశంలోని ప్రతీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భారత్ దేశాన్ని ఆర్ధిక శక్తిగా మార్చటంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది.
• మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ భద్రత కల్పించటంతో పాటు సాధికారిత దిశగా ఏపీ పనిచేస్తోంది.
• ఎస్ హెచ్ జీల సాయంతో స్వర్ణాంధ్ర 2047 కలను సాకారం చేసేలా ముందుకు వెళ్తున్నాం.
• ప్రతీ ఎస్ హెచ్ జీ ఓ ఆర్ధిక శక్తిగా, ప్రతీ మహిళా పారిశ్రామికవేత్తగా, ప్రతీ గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలన్నదే మా ఆలోచన.








