ది ట్రైటర్స్ తెలుగులో హోస్ట్‌గా తేజ సజ్జా మార్క్!
తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు సరికొత్త వినోదాన్ని అందించే టార్గెట్ తో వచ్చిన రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 20 మంది కంటెస్టెంట్లతో రూపొందిన ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్స్‌తోనే ఆసక్తిని పెంచుతోంది. రెగ్యులర్ రియాలిటీ షోలకు భిన్నంగా సాగే ఈ గేమ్‌లో స్ట్రాటజీలు, అనుమానాలు, మోసాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తేజ సజ్జా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
సినిమాల్లో తనదైన యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. హోస్టింగ్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. షోను నడిపించే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, సందర్భానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే తీరు ఆకట్టుకుంటున్నాయి. కొత్త బాధ్యతను స్వీకరించినప్పటికీ ఎక్కడా తడబడకుండా పరిణతితో వ్యవహరిస్తూ కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. హోస్ట్‌గా ఆయన ఎంచుకున్న పద్ధతి షోలోని ఉత్కంఠను మరింత పెంచుతోంది.
ఇప్పటివరకు రిలీజైన ఫస్ట్ మూడు ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్ల పరిచయంతో పాటు వారి వ్యక్తిత్వాలు, ఆటలో అనుసరిస్తున్న వ్యూహాలు ప్రేక్షకులకు పరిచయమయ్యాయి. ఆట నియమాలు అర్థం చేసుకోవడం సులభమే అయినా, ఎవరు నిజాయితీగా ఆడుతున్నారు? ఎవరు ఇతరులను తప్పుదోవ పట్టిస్తున్నారు? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఎపిసోడ్‌తో ఆట స్వరూపం మారే అవకాశం ఉండటంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదే స్థాయిలో సస్పెన్స్, వ్యూహాత్మక మలుపులు కొనసాగితే ది ట్రైటర్స్ తెలుగు తెలుగు రియాలిటీ షోల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశముంది.








