బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం: మంత్రి మండిపల్లి
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చిత్తశుద్ధితో ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు (Supreme Court) వరకు వెళ్లి పోరాడిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సంకల్పమన్నారు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా బీసీలుకు మేలు చేసే విధానాల అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.








