అక్టోబర్ 16 నుంచి 18 వరకు ఇండో అమెరికన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మీడియా సదస్సు
ఇండో – అమెరికన్ ప్రెస్ క్లబ్ (IAPC) ఆధ్వర్యంలో 11 వ వార్షిక అంతర్జాతీయ మీడియా సదస్సు జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 18 వ తేదీ వరకూ ఒహాయోలోని డెల్టా హోటల్స్ బై మారియట్ సిన్సినాటి షారన్విల్లేలో జరగనుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా వున్న పాత్రికేయులు, దౌత్యవేత్తలు, ఎన్నికైన మీడియా ప్రతినిధులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన నేతలు ఒకే వేదికపై కలుసుకోనున్నారు.
అయితే.. ఈ అంతర్జాతీయ మీడియా సదస్సు ద్వారా జర్నలిజం, మీడియా ఆవిష్కరణ, కృత్రిమ మేధస్సు, మోరల్ రిపోర్టింగ్, రిపోర్టింగ్ లో ఎన్నారైల భాగస్వామ్యం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, సాహిత్యం, ఆరోగ్యం,దాతృత్వం, వ్యాపారం, సామాజిక ప్రభావం వంటి రంగాలలో విశేషంగా విజయాలను గుర్తించే ప్రతిష్ఠాత్మకమైన IAPC అవార్డ్ గాలా, ఓ ఆకర్షణగా నిలవనుంది.
ఈ సదస్సులో ముఖ్యంగా
గ్రెగ్ లాండ్స్మన్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు
అఫ్తాబ్ పురేవాల్, సిన్సినాటి నగర మేయర్
నీరజ్ అంటాని, ఒహియో మాజీ అసెంబ్లీ సభ్యుడు
మాథ్యూ శామ్యూల్, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్
మీరా నాయర్, ప్రసిద్ధ నటి
వీరితో పాటు ఉత్తర అమెరికా, భారతదేశం, ఐరోపా మరియు మధ్యప్రాచ్యాలకు చెందిన ప్రముఖ పాత్రికేయులు, ప్రచురణకర్తలు, సంపాదకులు మరియు మీడియా నిపుణులు కూడా పాల్గొంటున్నారు.
అలాగే ఈ సదస్సులోనే వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు పురస్కారాల ప్రదానం కూడా వుంటుంది. ఈ కింది వారికి లైఫ్ అచీవ్ మెంట్ అవార్డ్స్ ఇవ్వనున్నారు.
Dr. Meher Medavaram
Dr. V.K. Raju
Mr. Roy Ratnavel
Mr. Muthu Mudaliar
Dr. T.S. Vineeth Bhatt
Dr. Subash Razdan
ఉమెన్ ఎంపవర్ మెంట్, సాహిత్య ఎక్స్ లెన్స్ అవార్డ్ Dr. Sunita Reddy గారెకి ఇవ్వనున్నారు.
మరో వైపు కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ కింద
Dr. Sunita Polepalli
Jay Bedi
Pramod Jhaveri
Most Impactful Book on South Asians Award
Dr. Mubin Syed
Karmashreshta Award
Sajan Varghese
Excellence in Leadership Award
Dr. Sujeet Punnam
ఇక ఇండో అమెరికన్ ప్రెస్ క్లబ్ చైర్మన్ డాక్టర్ సతీష్ కతుల మాట్లాడుతూ జర్నలిజంలో మరింత విలువలను పెంచేందుకు, మీడియా నిపుణుల మధ్య ప్రపంచ దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు లక్ష్యమని ప్రకటించారు.
అక్టోబర్ 16 మరియు 17 తేదీలలో జరగనున్న ‘IMC 2026 అవార్డ్స్ గాలా’, ఉత్తర అమెరికాలో భారతీయ మూలాలు కలిగిన మీడియా నిపుణుల అతిపెద్ద సమావేశాలలో ఒకటిగా నిలవనుంది. జీవితకాల సాధన, సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, దాతృత్వం, సాహిత్యం, వ్యాపార నాయకత్వం మరియు ప్రజా సేవ వంటి రంగాలలో విశేష కృషి చేసిన నాయకులను ఈ వేదికపై సత్కరిస్తారు. సమాజానికి అసాధారణమైన సేవలు అందించిన వారిని గౌరవించడంతో పాటు, జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలను ప్రోత్సహించాలనే IAPC లక్ష్యాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.








