తప్పు చేసి అధికారులపై నెట్టడం సరికాదు : హరీశ్రావు
తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రుల (Ministers) కు పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ( Harish Rao) అన్నారు. విద్యుత్ సమస్యలను అధికారులపై నెట్టడం సరికాదని, విద్యుత్ సంక్షోభానికి పాలకుల చేతగానితనమే కారణమని ఆరోపించారు. బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా విద్యుత్ సంక్షోభానికి, విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేసి కరెంట్ కోతలకు కారణమయ్యారు. నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసింది ప్రభుత్వమే. అధికారుల ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలు, అధికారులు తన ఉద్యోగం (Job) ఊడగొట్టకుండా రేవంత్ రెడ్డి చూసుకోవాలి అని అన్నారు.








