సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి శ్రీధర్‌బాబు
సింగరేణి (Singareni ) సంస్థను దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) ఆక్షేపించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సిగరేణిని కాపాడింది గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. సింగరేణి సంస్థకు బీఆరఎస్ ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈ సంస్థను కేసీఆర్ (KCR) కుటుంబసభ్యులు జేబు సంస్థగా మార్చుకున్నారు. బీఆరఎస్ పాలనలో సింగరేణి కార్మికులు ఇబ్బంది పడ్డారు. వారి సంక్షేమం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ (BRS) నేతలకు లేదు. సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదు. ప్రైవేటీకరణ చేయబోం.. చేయబోనివ్వం. యాదాద్రి పవర్ ప్లాంట్ (Yadadri Power Plant)ను పూర్తిస్థాయిలో నడిపిస్తాం అని స్పష్టం చేశారు.








