సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలో హీరోయిన్గా కాంతార బ్యూటీ!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(sai dharam tej) తన కెరీర్లో నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న సంబరాల యేటిగట్టు(Sambarala yetigattu) సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే తేజ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సేవ్ ది టైగర్స్(Save the tigers) వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను(Teja kakumanu) దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) ఈ కొత్త సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి క్లాప్ కొట్టారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ సప్తమి గౌడ(Saptami Gowda) ఎంపికైనట్టు తెలుస్తోంది. కాంతార(kaanthara) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, గతంలో నితిన్(nithin) నటించిన తమ్ముడు(thammudu) సినిమాలోనూ కనిపించారు. సాయి ధరమ్ తేజ్‌తో జోడీ కట్టడం ఆమెకు మరో తెలుగు అవకాశంగా నిలవనుంది. ఈసారి డైరెక్టర్ ఎంచుకున్న కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ కథలో పులి కీలక పాత్ర పోషించనుంది. దీంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రకృతి, వన్యప్రాణుల నేపథ్యంలో కథనం సాగుతుందని తెలుస్తోంది.
పులికి సంబంధించిన సీన్స్ ను స్క్రీన్ పై నేచురల్ గా చూపించేందుకు మేకర్స్ స్పెషల్ గా ప్లాన్స్ రెడీ చేసినట్టు సమాచారం. భారీ స్థాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరమయ్యే ఈ సినిమా కోసం ముందుగానే ప్రీ విజువలైజేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. పక్కా ప్రీ ప్రొడక్షన్ తర్వాతే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(thaman) ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో తొలి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే టైటిల్‌తో పాటు ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








