ఆదర్శ కుటుంబం రిలీజ్పై ఇంకా సస్పెన్సే..
విక్టరీ వెంకటేష్(venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. మొదట అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా పడింది. అయితే ఆ తేదీకి కూడా సినిమా రిలీజ్ కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఆలస్యమే ఇందుకు కారణమని నిర్మాత నాగవంశీ(naga vamshi) ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం అక్టోబర్ 30న ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా, మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేస్తోంది.
సాధారణంగా వెంకటేష్, త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు రిలీజ్ కు రెండు వారాల ముందే ప్రమోషన్స్ ఊపందుకోవాలి. సాంగ్స్, ట్రైలర్ లేదా కనీసం రిలీజ్ డేట్పై క్లియర్ అనౌన్స్మెంట్ అయినా రావాలి. కానీ ఆదర్శ కుటుంబం విషయంలో ఇప్పటివరకు అలాంటి హడావుడి కనిపించడం లేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏ దశలో ఉన్నాయనే సమాచారం కూడా బయటకు రావడం లేదు. దీంతో అక్టోబర్ 30న రిలీజ్ సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు, రిలీజ్ పోస్ట్పోన్ తో నిరాశ చెందిన వెంకటేష్ ఫ్యాన్స్, కొత్త డేట్ కు తగినట్టుగా ప్రచారం ఉంటుందని ఆశించారు. అయితే నాగవంశీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అలానే వదిలేశారనే డిస్కషన్ సాగుతోంది. దసరా తర్వాత ప్రమోషన్లు మొదలుపెట్టినా రిలీజ్ కు తక్కువ టైమ్ మాత్రమే మిగులుతుంది. మరి అక్టోబర్ 30నే సినిమాను తీసుకొస్తారా? లేక మరోసారి వాయిదా వేస్తారా? ఈ ప్రశ్నలకు నిర్మాత నాగవంశీ ఇచ్చే అఫీషియల్ అప్డేట్తోనే సమాధానం దొరకనుంది.








