నవంబర్, డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోరు!
టాలీవుడ్లో రాబోయే రెండు నెలలు ఆడియన్స్ కు సినిమా పండగను తీసుకురాబోతున్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్స్ వరకు వరుసగా తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నవంబర్లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. నవంబర్ 5న బాలీవుడ్ మూవీ రామాయణ: పార్ట్1తో ఈ జోరు మొదలుకానుంది. నవంబర్ 6న కిరణ్ అబ్బవరం నిర్మించిన హతః, సూర్య నటించిన తమిళ మూవీ సీన్ రిలీజ్ కానున్నాయి. 12న శర్వానంద్ భోగి, 13న మౌళి దొంగ నా కొడుకు, రానా దగ్గుబాటి నిర్మించిన డార్క్ చాక్లెట్, టాల్కమ్ పౌడర్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి.
నవంబర్ సెకండాఫ్ లోనూ పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. 19న విశ్వక్ సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది? రిపీట్ రిలీజ్ కానుండగా, 20న దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, ధనుష్ ఓం చాప్టర్1: ఉధిరం తో పాటు హాలీవుడ్ మూవీ ది హంగర్ గేమ్స్: సన్రైజ్ ఆన్ ది రీపింగ్ థియేటర్లలోకి రానున్నాయి. నవంబర్ 27న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ, రష్మిక మందన్నా మైసా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక డిసెంబర్ 4న నాగచైతన్య వృషకర్మ, నితిన్ అలియాస్ రుక్మిణి, విశ్వక్ సేన్ లెగసీ, శ్రద్ధా కపూర్ ఈత బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక డిసెంబర్ సెకండాఫ్ మరింత సందడిగా మారనుంది. 17న అవెంజర్స్: డూమ్స్డే, 18న డ్యూన్: పార్ట్ 3 వంటి హాలీవుడ్ భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ 24న బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100, షారుఖ్ ఖాన్ కింగ్ ఆడియన్స్ ముందుకు రానుండగా, 25న కిరణ్ అబ్బవరం రియాలిటీ, జుమాంజీ 3 రిలీజ్ కానున్నాయి. ఇలా వరుసగా పెద్ద సినిమాలు క్యూ కట్టడంతో థియేటర్ల వద్ద సందడి పెరగనుంది. అయితే, రిలీజ్ డేట్స్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో, ఈ సినిమాల బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.








