విజయ్ దేవరకొండ ముందున్న అసలైన సవాల్!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సాధారణ అంశంగా మారిపోయింది. విజయ్ దేవరకొండ(vijay devarakonda), నాని(nani), కిరణ్ అబ్బవరం(kiran abbavaram), సందీప్ కిషన్(Sundeep kishan) వంటి హీరోలు తమపై వస్తున్న విమర్శల గురించి రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో, వాటిని ఎదుర్కోవడానికి సరైన మార్గం ఏమిటనే డిస్కషన్ మొదలైంది. అయితే, విమర్శలకు సమాధానం చెప్పడం కంటే తమ టాలెంట్ తో ఆడియన్స్ ను మెప్పించడం ఎక్కువకాలం ఇంపాక్ట్ చూపిస్తుందని ఇప్పటికే పలువురి సెలబ్రిటీల కెరీర్లు ప్రూవ్ చేశాయి. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో ఫెయిల్యూర్ల తర్వాత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చి తమను విమర్శించిన వారికి ఆన్సర్ ఇచ్చిన దాఖలాలున్నాయి.
విజయ్ దేవరకొండ జర్నీలోనూ ఇలాంటి మలుపులు కనిపిస్తాయి. నోటా(NOTA) నిరాశపరిచిన తర్వాత ట్యాక్సీవాలా(Taxiwala)తో సక్సెస్ ను అందుకున్న ఆయన, ఆ తర్వాత డియర్ కామ్రేడ్(Dear Comrade), వరల్డ్ ఫేమస్ లవర్(World famous lover), లైగర్(liger) లాంటి సినిమాలతో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. ఖుషి(kushi) కొంత ఊరటనిచ్చినా, ఫ్యామిలీ స్టార్(Family Star), కింగ్డమ్(kingdom) సినిమాలు ఆయనకు కావాల్సిన రేంజ్ సక్సెస్ ను అందించలేకపోయాయి. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాలపై అంచనాలతో పాటు విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రణబాలి(ranabaali) ప్రమోషన్లలో ట్రోలింగ్‌పై విజయ్ మాట్లాడుతున్నప్పటికీ, ఆయన కెరీర్‌కు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బలమైన విజయమే కీలకంగా మారింది.
ప్రతి విమర్శకు కౌంటర్ ఇవ్వడం వల్ల తాత్కాలికంగా డిస్కషన్ పెరగొచ్చు కానీ, అది ట్రోలింగ్‌ను ఆపుతుందని చెప్పలేం. పైగా కొత్త వివాదాలకు అవకాశం కల్పించవచ్చు. అందుకే విజయ్ తన ఫోకస్ ను సినిమాల ఎంపిక, కథల క్వాలిటీ, యాక్టింగ్ పై కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆడియన్స్ మెచ్చే సినిమా అందిస్తే విమర్శల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సచిన్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పినట్లుగా, విజయ్ కూడా తన సక్సెస్‌లతోనే తన స్థాయిని ప్రూవ్ చేసుకోవాలి. రణబాలి ఆయనకు అలాంటి సక్సెస్ ను అందిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








