జనసేన కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో జనసేన (Jana Sena) నేతల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఇరు పార్టీల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మా చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. స్థానిక పరిస్థితుల మేరకు ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదు. పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తాం. మరో భేటీలో సీట్లు ఖాయం చేసుకుంటాం. కూటమి తరపున అభ్యర్థుల జాబితా (list) ప్రకటిస్తాం అని తెలిపారు.








