స్థానిక సంస్థల ఎన్నికల్లో .. కూటమి అన్ని స్థానాల్లో
ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్బస్ (Airbus) ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appala Naidu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురానికి ( Bhogapuram) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విమానాశ్రయాన్ని తెచ్చి చూపించారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ (Jagan) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో చేయలేనిది, కూటమి రెండేళ్లలో చేసి చూపించిందన్నారు. జగన్ ఉత్తరాంధ్ర అంతా తిరిగి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.








