జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radhakrishna) జనసేన పార్టీ ( Jana Sena Party)లో చేరారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) ఆయనకు కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు వంగవీటి రాధా జనసేన కేంద్ర కార్యాలయానికి రాగా, పవన్ ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన అనుచరులను పవన్కు పరిచయం చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన పవన్, వారితో ఫొటోలు (Photos) దిగారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమిష్టిగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా పవన్ దిశానిర్దేశం చేశారు.








