పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ.. ఓజీ 2 కోసమే వెయిటింగ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయ బాధ్యతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పాలనాపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్న ఆయన, కొంతకాలం సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇయర్ కొత్త సినిమా షూటింగ్లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు కూడా ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు సమాచారం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన నెక్ట్స్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ దృష్టిలో ఉన్న మెయిన్ ప్రాజెక్టు ఓజీ2(OG2). సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రైటింగ్ పూర్తైనట్టు సమాచారం. డైరెక్టర్ నెరేట్ చేసిన స్టోరీపై పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే, ముందుగా నాని(nani) హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో(bloody romeo) వర్క్స్ పూర్తిచేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఓజీ2 షూటింగ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2027 సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, సురేందర్ రెడ్డి(Surender reddy) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా ఉంటుందని గతంలో అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ, కథ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కనపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర డైరెక్టర్లతోనూ కొత్త సినిమాల విషయంలో ఆయన తొందరపడటం లేదని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory), రామ్ తాళ్లూరి(ram talluri), మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) వంటి నిర్మాణ సంస్థలకు ఫ్యూచర్ లో సినిమాలు చేయాల్సిన కమిట్మెంట్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రాజకీయాలే పవన్ ప్రాధాన్యతగా మారాయి. ఓజీ2తోనే ఆయన మళ్లీ వెండితెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.








