‘వృషకర్మ’ డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్- సరికొత్త అడ్వెంచర్ పోస్టర్
యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అధికారికంగా ధృవీకరించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
సినిమా విడుదలకు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాగ చైతన్య స్టైలిష్‌గా, యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. పదునైన లోహపు అంచు ఉన్న తాడు ఆయుధాన్ని చేతబట్టి ఉన్న ఆయన చుట్టూ దుమ్ము మేఘాలు, గాల్లో ఎగురుతున్న రాళ్లు, తుఫాను వాతావరణంతో కూడిన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇంటెన్స్ , యాక్షన్ లుక్ లో నాగ చైతన్య ఆకట్టుకుంటున్నారు. పురాణాలు, సస్పెన్స్, యాక్షన్‌తో కూడిన ఈ సినిమా అడ్వెంచర్, మిస్టరీతో నిండిన ప్రపంచాన్ని పోస్టర్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. రాగుల్ డి హెరియన్ డీవోపీ అందిస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్.
నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ‘వృషకర్మ’ నిలుస్తోంది. ఆయన కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా నమోదు చేసింది. ఇప్పటికే సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ విశ్లేషకుల నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే చిత్రబృందం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.








