జగన్కు ఇక చంచల్గూడ జైలే గతి : వర్ల రామయ్య
అక్రమాస్తుల కేసుల రోజు వారీ విచారణ, మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో వైసీపీ అధినేత జగన్(Jagan)కు ఇక చంచల్గూడ జైలే (Chanchalguda Jail) గతి అని తెలుగుదేశం ఎమ్మెల్సీ వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అవినీతి కేసులు, హత్యా రాజకీయాలతో ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ (CBI) తేల్చిచెప్పింది. ఆ కేసులో 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలో ఉన్నారు అని విమర్శించారు.








