రాష్ట్రంలో ఎవరికీ లేని వెసులుబాటు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు?: సీఎం రేవంత్ రెడ్డి
కమీషన్ల కోసం కాళేశ్వరం 9Kaleshwaram) పేరిట రూ.లక్ష కోట్లను గోదావరిలో వృథాగా పోశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మేడిగడ్డ ( Medigadda)ను మొత్తం కూల్చేసి మళ్లీ కట్టాలని కేంద్ర నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. ఎన్‌నినో పరిస్థితులపై మంత్రులలో చర్చ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల్లో మన వాటాను తగ్గించి, తెలంగాణకు మరణశాసనం రాసిందెవరు? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని 2015లో సంతకం చేసిందెవరు? పదేళ్లలో కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినా, నీటిని నిల్వ చేసుకుని ఉండేవాళ్లం. దాదాపు వంద దేశాల్లో ఎన్‌నినో ప్రభావం ఉంది. మరి వంద దేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందా? కొండపోచమ్మ (Kondapochamma) నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తర్వారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR farmhouse)కు నీరు వెళ్లోంది. రాష్ట్రంలో ఎవరికి లేని ప్రత్యేక వెసులుబాటు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు? ఈ నీటి ఎత్తిపోతలపై నిజనిర్ధారణకు మేం సిద్ధం అని తెలిపారు.








