దీనికి కారణం మీ ప్రభుత్వం కాదా? : హరీశ్రావు
బొగ్గు ఉత్పత్తి లేక విద్యుత్తు నిలిచిపోతోంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నా మోటార్లు నడపకపోవడంతో నీళ్లు వస్తలేవు. రాష్ట్రంలో మూడు నెలల నుంచి రైతు బీమా పథకం ఆగిపోయింది. వేలాది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీనికి కారణం మీ ప్రభుత్వం కాదా? అని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో రైతు బీమా సొమ్ము అందని కుటుంబాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫెయిల్ అయ్యారు. తప్పులన్నీ మీరు చేసి విద్యుత్తు అధికారులను సస్పెండ్ చేస్తామనడం ఏంటి? ముందుగా మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. బీమా సొమ్ము అందక రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి లేచి ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. లేదంటే అదే రైతు కుటుంబాలతో సీఎం ఇంటి ముందు ధర్నా, సచివాలయం (Secretariat) ముట్టడి నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.








