కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి : కేటీఆర్
రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు కుంభకోణం ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో భారీ స్కామ్కు కుట్ర జరుగుతోంది. భోత్రా లాజిస్టిక్స్ 9Bhothra Logistics) అనే అనుమానాస్పద కంపెనీతో ముందే సీఎం చీకటి ఒప్పందం చేసుకున్నారు. కృత్రిమ బొగ్గు కొరత, కరెంటు సంక్షోభం సృష్టించి, ఆ కంపెనీని రంగంలోకి దించారు. భోత్రా లాజిస్టిక్స్తో ప్రభుత్వం, సింగరేణి (Singareni) చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలి. మొత్తం కుంభకోణంపై స్వంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటువంటి వ్యవహారాలను అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని అన్నారు.








