సిట్ విచారణకు హాజరైన కారుమూరి సునీల్
ఆంధ్రప్రదేశ్లో మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో కారుమూరి సునీల్ (Karumuri Sunil) సిట్ విచారణ రెండో రోజు కొనసాగింది. హైదరాబాద్లోని చంచల్గూడ జైలు (Chanchalguda Jail)లో ఉన్న సునీల్ను ఏపీ సీఐడీ (AP CID), సిట్ (SIT) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు. మద్యం రవానా టెండర్ల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఆరా తీసినట్లు సమాచారం. టెండర్ల ప్రక్రియలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారనే కోణంలో విచారించారు. అదే విధంగా టెండర్ల వ్యవహారంలో తెరవెనుక ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై ప్రశ్నించారు. అక్రమాల వెనుక ఎవరెవరి ప్రయోజనాలు ఉన్నాయనే అంశంపై ఆరా తీశారు. సునీల్ను రెండు రోజుల సిట్ కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) అనుమతించిన విషయం తెలిసిందే.








