గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
గాదె సాయికృష్ణ (Gade Saikrishna) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) సీబీఐ (CBI) కి బదిలీ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ సాయికృష్ణ తల్లి (Saikrishna mother)తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ (Petition) దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.








