విజయవాడలో ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’ను అట్టహాసంగా నిర్వహిస్తాం: వేగా జ్యువెలర్స్ ఎండీ నవీన్ వనమా
అక్టోబర్ 17న ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మెగా సాంస్కృతిక వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
నగర ప్రజలకు సరికొత్త వినోదాన్ని పంచుతామన్న నిర్వాహకులు
విజయవాడ: విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని, కళలను ప్రతిబింబించేలా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా తెలిపారు. వీ వైబ్ సహకారంతో అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 7:00 గంటల నుండి ఎం.జి. రోడ్లోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నవరాత్రి సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బందర్ రోడ్డు లబ్బీపేట లోని వేగా జువెలర్స్ షో రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగ దాండియా ఉత్సవ్ 2.0′ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ మెగా సాంస్కృతిక ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆయనతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేయనున్నారని తెలిపారు. బెజవాడ సంస్కృతి, కళా వైభవానికి సరికొత్త జోష్ జోడిస్తూ సినిమా తారల రాకతో ఈ దాండియా రాత్రి మరింత కలర్ఫుల్గా మారనుందని నవీన్ వనమా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఉత్సవంలో నగర ప్రజలను, యువతను ఉర్రూతలూగించడానికి విభిన్న కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ మరియు వారి బృందం ప్రదర్శించబోయే ప్రత్యేక నృత్య రూపకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఈవెంట్కు ప్రధాన హైలైట్గా నిలవనున్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఇద్దరు ప్రముఖ డీజేల అదిరిపోయే సంగీతం, సంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల మధ్య నగర యువతీ యువకులు సంప్రదాయ దుస్తులలో దాండియా కోలాటాలతో అలరించనున్నట్లు చెప్పారు.

ఉత్సవానికి వచ్చే ప్రతి ఒక్క అతిథికి ప్రవేశ ద్వారం వద్దే ఆరతి, తిలకంతో మన సంస్కృతి ఉట్టిపడేలా ఘన స్వాగతం పలకనున్నట్లు నవీన్ వనమా తెలిపారు. వేడుక ప్రాంగణంలో సందర్శకులను ఆకట్టుకునేలా రకరకాల నోరూరించే ఫుడ్ స్టాల్స్, ప్రత్యేక మాక్టైల్స్ కౌంటర్లు, ఫేస్ పెయింటింగ్, కలర్ఫుల్ గాజుల స్టాల్స్ మరియు సంప్రదాయ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే, ఈ వేడుకల్లోని మధుర జ్ఞాపకాలను బంధించేందుకు ప్రత్యేకంగా ‘మ్యాగ్నెటిక్ ఫోటో బూత్’తో పాటు పలు సెల్ఫీ పాయింట్లను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. విజయవాడ నగర కళా వైభవాన్ని చాటిచెప్పేలా, ఒకే వేదికపై సంగీతం, సంప్రదాయ నృత్యాలు మరియు వినోదాన్ని అందిస్తున్న ఈ ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’లో నగర ప్రజలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వేగా జ్యువెలర్స్ ఎండీ నవీన్ వనమా, పిలుపునిచ్చారు.
విలేకరుల సమావేశంలో వేగ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా పాల్గొన్నారు.








