చీరలో చందమామలా మెరిసిపోతున్న సారా
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్(Sara Ali Khan) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్లను ఇట్టే కట్టిపడేస్తోంది. తాజాగా ఈ భామ పండగ వాతావరణాన్ని తలపించేలా ఎల్లో కలర్ శారీలో దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో రాజసంతో కూడిన ఆమె రాయల్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోషూట్ కోసం పింక్, గోల్డ్ అంచులు కలిగిన పసుపు రంగు పట్టు చీరలో ఎంతో అందంగా దేవకన్యలా మెరిసిపోతోంది. బ్లౌజ్ హ్యాండ్స్పై ఉన్న నెమలి డిజైన్లు మరియు గ్రాండ్ వర్క్ బ్లౌజ్ ఆమె లుక్‌ను మరింత రిచ్‌గా మార్చేశాయి. చీరకు తగ్గట్టు ఎమరాల్డ్ స్టోన్స్ కలిగిన భారీ హారం, నడుముకి వడ్డాణం, ట్రెడిషనల్ ఆభరణాలు ఆమె లుక్ కు రాయల్ టచ్ ను ఇచ్చాయి. ఈ అవుట్‌ఫిట్ లో సారా చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.








