ఓటమి భయంతోనే వైసీపీ దాడులు : మంత్రి బీఎస్బీవీ స్వామి
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మంత్రి డీఎస్బీవీ స్వామి (DSBV Swami) ఆరోపించారు. పుంగనూరు, చిత్తూరు, మదనపల్లెలో హింసను ప్రేరేపించిందని, దర్శి (Darsi)లో ఏకంగా ఎస్సై పైనే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన జగన్, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ (Jagan) మాయమాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరగుతోందని స్పష్టం చేశారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వైసీపీ (YSRCP) కార్యకర్తలపై చర్యలు తప్పవన్నారు.








