హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో భారీగా ఎస్సైల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సబ్ ఇన్స్పెక్టర్లు (Sub Inspectors ) బదిలీ అయ్యారు. ఒకేసారి 75 మంది ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సజ్జనర్ (CP Sajjanar) ఉత్తర్వులు జారీచేశారు. సీసీఎస్ డీడీగా ఉన్న బీ.కృష్ణను జూబ్లీహిల్స్ (Jubilee Hills) పీఎస్కు బదిలీ చేశారు. అదేవిధంగా సీసీఎస్ డీడీలో పనిచేస్తున్న ఏ.మధుసూధన్ను ఖైరతాబాద్ (Khairatabad) పీసీఆర్, బహదూర్పురా పీఎస్ ఎస్ఐగా ఉన్న జీ.అంబేద్కర్ను నాంపల్లి పీఎస్కు బదిలీ చేశారు.








