విజయ్, రష్మికలకు భట్టి దంపతుల దసరా కానుక
సినీనటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika)ల వివాహం అనంతరం తొలిసారి దసరా పండగ (Dasara Festival)ను తెలంగాణలో జరుపుకొంటున్న సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) దంపతులు వారిని ప్రజాభవన్‌కు ఆహ్వానించి నూతన వస్త్రాలను అందజేశారు. రష్మికకు విడిగా బతుకమ్మ చీరనూ అందజేశారు. వారిద్దరికీ భట్టి దంపతులు పండగ శుభాకాంక్షలు తెలిపారు.








