2029లో అధికారంలోకి వచ్చేది మేమే : అంబటి రాంబాబు
రాష్ట్రంలో 2029 లో అధికారంలోకి వచ్చేది మేమే. మొదటి ఆరు నెలలు నేనే హోంమంత్రిని అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులనుద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న నాయకులు, పోలీసులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. గుంటూరు (Guntur)లో వైసీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి (Nagapadma Sridevi) నామినేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయం నుంచి ఆదివారం నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. ఆర్వో కార్యాలయానికి సమీపంలోనే పోలీసులు బారికేడ్లతో వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడున్న పోలీసులంతా మంచివారే, ఒక్కరు తప్ప అంటూ అక్కడే విధుల్లో ఉన్న పట్టాభిపురం సీఐ (Pattabhipuram CI)ని ఉద్దేశిస్తూ రాంబాబు వ్యాఖ్యానించారు.








