విజయదశమి శుభవేళ ఆయుధ పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజయదశమి (Vijayadashami) పండుగను కుటుంబ సభ్యులు మరియు రాష్ట్ర ప్రజల సమక్షంలో అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్లోని అధికారిక నివాసంతో పాటు తన స్వగ్రామంలో జరిగిన వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ చేపట్టారు. భద్రతా సిబ్బంది వినియోగించే ఆయుధాలను ఉంచి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav), పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.









