దసరా సందర్భంగా ‘రామాయణం’ నుంచి యశ్ పవర్ఫుల్ రావణ తాండవం రిలీజ్
నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన సందర్భంగా, దసరా పండగను పురస్కరించుకుని మేకర్స్ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించే ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ కొత్త వీడియోలో యశ్ లంకాధిపతి రావణుడిగా ఎలా మారారో చూపించారు. గంభీరమైన రూపం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యశ్ ఆకట్టుకున్నారు. హిందీలో ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో పవర్ ఫుల్ సంగీతంతో కూడిన రావణ తాండవాన్ని ఆవిష్కరించారు.
హిందూ పురాణాల్లో తాండవం అనేది పరమశివుడితో ముడిపడిన విశ్వ నృత్యం. సృష్టి, స్థితి, లయ చక్రాలకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. పరమశివుడికి పరమ భక్తుడైన రావణుడు ‘శివ తాండవ స్తోత్రం’తో ప్రసిద్ధి. శివుడిని స్తుతిస్తూ రచించిన ఈ స్తోత్రం శక్తివంతమైన లయ, గంభీరమైన స్వరాలతో ప్రసిద్ధి చెందింది. ఈ పౌరాణిక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని విడుదల చేసిన దసరా స్పెషల్ వీడియోలో రావణుడి భక్తి, శక్తి, గంభీరమైన వ్యక్తిత్వాన్ని చూపించారు. ఈ పాత్రను వెండితెరపై ఎలా తీర్చిదిద్దారో ఈ వీడియో ఒక ప్రత్యేకమైన గ్లింప్స్‌ను అందిస్తోంది.
ఈ వీడియోలో యశ్ అచ్చంగా భారీ స్థాయి రావణుడిగా కనిపిస్తున్నారు. ఆయన ఫిజిక్, లుక్, పాత్రకు తీసుకొచ్చిన డెప్త్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సీక్వెన్స్‌లో రావణుడి పాత్రను ఎంత భారీ స్థాయిలో రూపొందించారో కూడా చూడొచ్చు. ఇతిహాసాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరిస్తున్న క్రమంలో, రావణుడిని శక్తిమంతమైన, సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రగా చూపించనున్నారు. తన గత చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను సంపాదించుకున్న యశ్‌కు, భారతీయ పురాణాల్లో అత్యంత గుర్తింపు పొందిన పాత్రల్లో ఒకటైన రావణుడి పాత్ర కొత్త అనుభూతిని అందించనుంది.
రావణుడిపై ఈ ప్రత్యేక వీడియోను దసరా సందర్భంగా విడుదల చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. తరతరాలుగా భారతీయుల సాంస్కృతిక ఊహల్లో భాగమైన ఈ ఇతిహాసాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరిస్తూ ఇద్దరు అగ్ర కథానాయకులను ఒకే చిత్రంలో తీసుకొస్తున్నారు.
ఈ పాటలను టీ-సిరీస్ లేబుల్‌పై విడుదల చేస్తున్నారు. హిందీలో ‘రైజ్ ఆఫ్ అసుర’, కన్నడలో ‘రావణ తాండవ’, తమిళం, తెలుగులో ‘రావణ తాండవం’ పేర్లతో ఈ వీడియోను రూపొందించారు. హిందీ వెర్షన్‌కు విశాల్ దడ్లానీ వోకల్స్ అందించగా, డాక్టర్ కుమార్ విశ్వాస్ సాహిత్యం రాశారు. ఏ.ఆర్. రెహమాన్, హీరల్ విరాడియా సంగీత పర్యవేక్షణ చేశారు. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ గానం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులను అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాల సినిమాటిక్ ఇతిహాసంగా రూపొందుతున్న ‘రామాయణ’ తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారతదేశంలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ ప్రేక్షకులు చూడనున్నారు. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించనుంది.








