అర్నబ్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అర్నబ్ తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సూచించిన సీఎం
కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సాధారణ స్థితి
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష
తుఫాన్ నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని ముఖ్యమంత్రికి తెలిపిన అధికారులు
పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలి.
• అర్నబ్ తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసింది.
• ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
• రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు.
• మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుఫాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.
• ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలి.
• రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదు.
• ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి.
• పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడేయాలి.
• అర్నబ్ తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశాం.
• చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
• పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలా వరకు తొలగించాం.
• ఇంకా ఎక్కడైనా పడిపోయిన చెట్లు రోడ్లపై ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.
• తుఫాన్ కారణంగా పోగైన చెత్తను కూడా తీసేయాలి.
• రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలి.
• నష్ట పరిహారానికి సంబంధించిన అంశాలపై జీవో జారీ చేశాం.
• పంట నష్టం మినహా బాధితులకు నష్టపరిహరం అందించాలి.
• త్వరగా తుఫాన్ నష్టంపై అంచనాలు సిద్దం చేయాలి.
• నీట మునిగిన పంటలను ఏ మేరకు కాపాడగలమో చూడాలి.
• దీనిపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అధ్యయనం చేయాలి.
• పంట మట్టిపాలు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఆలోచించాలి.
• కొబ్బరి చెట్లు సహా వివిధ ఉద్యాన పంటలకు చెందిన చెట్లు, మొక్కలను తిరిగి ప్లాంట్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్నీ పరిశీలించాలి.
• తుఫాన్ బాధిత వ్యవసాయ, ఉద్యాన రైతులకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి వివిధ స్కీంలను వర్తింప చేయాలి.
• తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలి.
• ప్రభుత్వం చేసే పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి.. అప్పుడే ప్రజల నుంచి సహకారం లభిస్తుంది.
• త్వరితగతిన పంట నష్టం అంచనాలను సిద్దం చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి.









