అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మిస్సింగ్
అమెరికాలో తెలంగాణ విద్యార్థి కోయ శ్రీజ (23) అదృశ్యమైంది. మసాచు సెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ లో నివాసం వుంటోంది. నవంబర్ 3 వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నవంబర్ 2 వ తేదీన తన నివాసం నుంచి బయలుదేరింది. అప్పుడే చివరి సారి కనిపించింది. అప్పటి నుంచి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె విద్యార్థి వీసాపై వుంటోంది.
ఉన్నత విద్య కోసం అమెరికాలోని బోస్టన్ వెళ్లిన ఆమె, అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీజ కోయది నల్లగొండ జిల్లాగా తెలుస్తోంది.
శ్రీజ కనిపించడం లేదని కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో బోస్టన్ పోలీసులు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అదే విధంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధికారులతో మాట్లాడారు. శ్రీజకి సంబంధించిన విషయం ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు, కుటుంబీకులు కోరుతున్నారు.






