ఏపీ ప్రభుత్వంతో కియా కీలక ఒప్పందం
సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కియా కార్పోరేషన్ సంస్థ. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఎంఓయూ చేసుకున్న కియా. పెనుకొండలో మరో ప్లాంట్ ఏర్పాటుకు రూ.19 వేల కోట్ల పెట్టుబడిగా పెట్టేందుకు కియా సంస్థతో ఒప్పందం. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న కియా సంస్థ.
ప్రస్తుతం పెనుకొండ ప్లాంట్ నుంచి ఏడాదికి 4.3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్న కియా సంస్థ. ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కియా ప్రతినిధులు. దీంతో మొత్తంగా ఏడాదికి 6.3 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకోనున్న ఏపీ కియా. ఆంధ్రప్రదేశ్ యూనిట్లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్న కియా కార్పోరేషన్. సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న కియా సంస్థ.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి, కియా కార్పోరేషన్ సీఈఓ
కియా సంస్థతో ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• కియా కార్ల సంస్థ రాష్ట్రంలో రూ. 19 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడుతోంది.
• పెనుకొండకు కియా సంస్థ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
• ఆ సంస్థను ఏపీకి తీసుకువచ్చేందుకు విస్తృత ప్రయత్నాలు చేశాం.
• గొల్లపల్లి రిజర్వాయర్ కు నీరు తీసుకువచ్చి కియా ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాం.
• జాతీయ రహదారితో పాటు బెంగుళూరు ఎయిర్ పోర్టు కనెక్టివిటీ కల్పించి ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించాం.
• స్వయంగా దక్షిణ కొరియాకు వెళ్లి వారి యాజమాన్యాన్ని ఒప్పించాం. 14 నెలల్లోనే ప్లాంట్ నిర్మించారు.
• ఏపీలో తయారైన తొలి కియా కారును నేనే ప్రారంభించాను.
• ఇప్పుడు మేడ్ ఇన్ ఏపీ కియా కార్లు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
• ఏపీపై నమ్మకం ఉంచి మళ్లీ రూ. 19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటం అభినందనీయం.
• పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పారిశ్రామిక వేత్తలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
• ఇక నుంచి ఏపీలో ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించాం.
• ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్టును కూడా పెట్టుబడులకు రక్షణగా తీసుకువస్తున్నాం.
• ఏపీ పారిశ్రామిక రంగానికి దక్షిణ కొరియా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కోరుతున్నాను.
• విదేశీ పెట్టుబడులకు కూడా ఏపీ ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉంది.
• అందుకే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మాకే వచ్చాయి.
• సామాజిక బాధ్యతగా కియా పీ4 కార్యక్రమానికి కూడా సహకరించాలని కోరుతున్నాను.
• నైపుణ్యం ఉన్న యువత ఏపీలో ఉంది. అవకాశాలు కల్పిస్తే పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది.
• 2029 మే నాటికే రెండో ప్లాంట్ పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని కోరుతున్నాను.








