పెద్ది వివాదంపై జాన్వీ కపూర్ పశ్చాత్తాపం!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా, బుచ్చిబాబు సానా(Buchibabu sana) దర్శకత్వంలో వచ్చిన పెద్ది(peddi) సినిమాలో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చిత్రీకరణపై గతంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అచ్చియమ్మ(Achiyamma) పాత్రను తెరపై చూపించిన విధానం, కొన్ని సీన్స్ లో ఆమె బాడీ లాంగ్వేజ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రేమను ఒప్పుకునే అంశాన్ని చూపించిన తీరు ఆడియన్స్ లో డిస్కషన్ కు దారితీశాయి. తాజాగా ఈ వివాదంపై జాన్వీ స్పందించినట్లు సమాచారం. సినిమా కోసం పనిచేసిన వారందరి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మొదట్లో ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడినప్పటికీ, తన మనసులో మాత్రం ఈ విషయం అసంతృప్తిని కలిగించిందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది.
కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ.. కొన్ని సీన్స్ షూటింగ్ తనకు అసౌకర్యంగా, తన పర్సనల్ లిమిట్స్ ను దాటిన అనుభవంగా అనిపించిందని పేర్కొన్నట్లు సమాచారం. మహిళలను వస్తువుల్లా చూపించే విధానం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ టైమ్ లోనే తన అభ్యంతరాలను మరింత బలంగా వినిపించాల్సిందని, తనకున్న అవకాశాలు, సామాజిక నేపథ్యాన్ని ఉపయోగించి మార్పు కోసం ప్రయత్నించాల్సిందని ఆమె భావించినట్లు సమాచారం. నటీనటులు డైరెక్టర్ సూచనల ప్రకారం పనిచేయాల్సి వస్తుందని, స్క్రిప్ట్ చదివినప్పుడు కెమెరా యాంగిల్స్, స్క్రీన్ పై సీన్స్ ఎలా కనిపిస్తాయో పూర్తిగా అర్థం కాకపోవచ్చని కూడా ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ వివాదంపై డైరెక్టర్ బుచ్చిబాబు సానా గతంలోనే ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టిన సీన్స్ విషయంలో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణంలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత ముఖ్యమో, నటీనటుల అంగీకారం, మహిళల గౌరవం కూడా అంతే ముఖ్యమనే డిస్కషన్ కు ఈ పరిణామం తెరలేపింది. షూటింగ్ టైమ్ లో ఎదురయ్యే అసౌకర్యాలపై నటీనటులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించగల వాతావరణం ఉండాలనే అంశాన్ని ఈ వివాదం మరోసారి తెరపైకి తెచ్చింది.








