చిరు-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌పై మళ్లీ మొదలైన చర్చలు!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. నేచురల్ స్టార్ నాని(nani) నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవిని డిఫరెంట్ యాంగిల్ లో చూపించబోతున్నారనే ప్రచారం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
అయితే, శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాగా వచ్చిన ది ప్యారడైజ్(the paradise) ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. చిరంజీవితో సినిమా విషయంలో కొంత టైమ్ పట్టే అవకాశం ఉందని నిర్మాత నాని గతంలో వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, చిరంజీవి సినిమాకు ముందే శ్రీకాంత్ మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగాస్టార్ సినిమా వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, గతంలో మిక్డ్స్ రిజల్ట్స్ అందుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్(meher ramesh)కు చిరంజీవి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో, శ్రీకాంత్ ఓదెల విషయంలోనూ ఆయన డెసిషన్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పడానికి ఇప్పటివరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేదా మేకర్స్ నుంచి క్లారిటీ వస్తేనే ఈ ప్రచారానికి తెరపడనుంది. అప్పటివరకు చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల సినిమా విషయంలో వస్తున్న వార్తలను ఊహాగానాలుగానే చూడాలి.








