అఖిల్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni), లెనిన్(Lenin) సినిమాతో తిరిగి సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకోవడంతో అఖిల్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇకపై సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్ ముందుకు వస్తానని అఖిల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే లెనిన్ రిలీజై మూడు నెలలు గడుస్తున్నా, అఖిల్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. దీంతో ఆయన కొత్త సినిమా ఎవరితో ఉండబోతుందనే ఆసక్తి సినీ వర్గాల్లో పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, అఖిల్ ప్రస్తుతం ఇద్దరు డైరెక్టర్లతో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒక డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన తర్వాత ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. కథ, తన క్యారెక్టర్ తో పాటు ఇతర అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాత అఖిల్ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయని, 2027 సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, అఖిల్ కెరీర్ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఓ ప్రాజెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వివరాలను వచ్చే ఏడాది వెల్లడించే అవకాశముంది. ఒకవైపు కొత్త డైరెక్టర్ తో సినిమా, మరోవైపు సొంత నిర్మాణ సంస్థలో మరో ప్రాజెక్టు.. ఇలా అఖిల్ తన కెరీర్ను కొత్త దిశలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ వచ్చే వరకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.








