డీఎస్పీ సాంకీగా విశ్వక్ మాస్ విధ్వంసం!
విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Viswak sen).. ఇప్పుడు కల్ట్(Cult) సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ఆయనే హీరోగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త స్లాషర్ యాక్షన్ జానర్‌ను పరిచయం చేయాలనే టార్గెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచుతోంది. ఇందులో విశ్వక్ సేన్ క్యారెక్టర్ ను పరిచయం చేసిన తీరు, యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ డీఎస్పీ సాంకీగా కనిపించనున్నారు. ప్రాంతీయ వివక్షను ఏమాత్రం సహించని ఆవేశపరుడైన పోలీస్ అధికారిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. గోవాలో స్థానికులు ఇతర ప్రాంతాల వారిని వేధిస్తే ఎదురుతిరిగి నిలబడే వ్యక్తిగా ఆయన క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫైట్స్ లో ఆయన చూపించిన దూకుడు, స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ తనదైన యాక్టింగ్ తో మెప్పిస్తూ, తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కనిపిస్తున్నారు. ఆయనను డీఎస్పీ సాంకీగా చూపించిన తీరు ఫ్యాన్స్ కు నచ్చేలా ఉంది.
టెక్నికల్ గా కూడా కల్ట్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. నిర్మాణ విలువలు, విజువల్స్ ప్రతి సీన్ లో కనిపిస్తుండగా, రవి బస్రూర్(Ravi basrur) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌కు మరింత బలాన్ని అందిస్తోంది. గాయత్రి భరద్వాజ్(Gayathri Bharadwaj) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ కాకరాల(Sandeep kakarala) నిర్మిస్తున్నారు. సరికొత్త యాక్షన్ అనుభూతిని అందిస్తామని సంకేతాలిస్తున్న ఈ సినిమా స్లాషర్ జానర్‌కు కొత్త ప్రేక్షకులను పరిచయం చేస్తుందా? బాక్సాఫీస్ వద్ద విశ్వక్ సేన్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆయన కెరీర్లో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=t3vVEXGvo7Y








