లాస్ ఏంజెల్స్ బరిలో ఎన్నారై నిత్యా రామన్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..
అమెరికా లాస్ ఏంజెలెస్ మేయర్ పదవి కోసం ఎన్నారై నిత్యా రామన్ పోటీ పడుతున్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ప్రజా భద్రత, ఉద్యోగాలు, పర్యావరణం వంటి అంశాలతో పాటు స్థానిక సమస్యలను లెవనెత్తుతూ ప్రత్యర్థులకు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న మేయర్ ఎన్నికల రన్‌ఆఫ్‌లో, ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై పలు పోల్స్‌లో ఆధిక్యంలో ఉన్నారు.ఆమె గెలిస్తే, ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలుస్తారు.
అయితే.. నిత్యా రామన్ ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులపై, పోలీసుల తీరుపై విమర్శలకు దిగారు. పోలీస్ చీఫ్ జిమ్ మెక్ డొనెల్ ను మార్చాలని పిలుపునిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం, యూనివర్సల్ సిటీలో NBC4 మరియు టెలిముండో 52 సంయుక్తంగా నిర్వహించిన, టెలివిజన్‌లో ప్రసారమైన ఏకైక ముఖాముఖి చర్చలో మంగళవారం ఈ ఇద్దరు అభ్యర్థులు విమర్శలకు దిగారు.
ఇమ్మిగ్రేషన్ నియంత్రణ కార్యకలాపాల సమయంలో లాస్ ఏంజిల్స్ పోలీస్ శాఖ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఏజెంట్లను రక్షిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇది “ఇక్కడి వలస సమాజాల గుండెల్లో భయాన్ని సృష్టిస్తోందని” రామన్ ఆరోపించారు. ఈ దాడుల తీరు చూస్తుంటే స్థానిక చట్టాల అమలుపై ప్రజలకు వున్న నమ్మకాన్ని దెబ్బతీసిందని వాదించారు. అంతేకాకుండా కొత్త నాయకత్వం కూడా రావాలని గట్టిగా వాదించారు. అయితే.. ఆయన్ని తొలగించడంపై తానేమీ కాల పరిమితి విధించడం లేదన్నారు.
నిత్య రామన్ నేపథ్యమిదీ…
నిత్య రామన్ స్వస్థలం కేరళ. ఢిల్లీ, చెన్నైలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొన్నారు. ఆరేళ్ల వయస్సులోనే నిత్య కుటుంబం అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత బాగా చదువుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుంచి అర్బన్ ప్లానింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.
రాజకీయాల్లోకి రాక మునుపు ఆమె అర్బన్ ప్లానర్ గా పనిచేశారు. 202 లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజల్ సిటీ కౌన్సిల్ కి ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా రికార్డు కూడా నెలకొల్పారు.








