పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ టైటిల్ ఖరారు… కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని, కాన్సెప్ట్ పోస్టర్ని బుధవారం నాడు రివీల్ చేశారు.
విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.








