విమానంలో అభిమాని తీరుపై కీర్తి సురేశ్ అసహనం
హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy suresh) కు ఫ్లైట్ జర్నీలో ఎదురైన ఓ చేదు అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్‌తో ముచ్చటించడం, వారితో ఫొటోలు దిగడం తనకు ఇష్టమేనని చెప్పే ఈ ముద్దుగుమ్మ.. కొందరు మాత్రం లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తుంటారని వెల్లడించారు. మిలాన్ నుంచి ఇండియాకు వస్తున్న టైమ్ లో జరిగిన ఇన్సిడెంట్ను గుర్తుచేసుకుంటూ, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఫ్యాన్స్ గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ జర్నీలో కీర్తి తన భర్త ఆంటోనీ తట్టిల్(Anthony thattil)తో కలిసి ఉన్నారు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ కావాలని పట్టుబట్టాడని, అతడు సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండటంతో, తర్వాత ఫొటో దిగుదామని కీర్తి సూచించినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా వెంటనే సెల్ఫీ తీసుకోవాలని ఒత్తిడి చేశాడని, దీంతో అతడి డెసిషన్ ను తాను ఒప్పుకోవాల్సిన అవసరం లేదని కీర్తి స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది.
ఈ ఘటనలో తన భర్త స్పందించిన తీరు కూడా కీర్తిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఫ్యాన్స్ తో ఎంతో సౌమ్యంగా ఉండే ఆంటోనీ.. తొలిసారి గట్టిగా మాట్లాడి ఆ వ్యక్తిని నిలదీశారని ఆమె తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విమాన సిబ్బంది సహాయం కూడా తీసుకున్నారట. అయితే, ఫ్యాన్స్ అందరూ ఇలాగే ఉండరని కీర్తి పేర్కొన్నారు. కొందరు ప్రయాణమంతా తనతో సరదాగా మాట్లాడుతుంటారని, ఫొటో అడగకుండానే ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు.








