ఆదర్శ కుటుంబం రన్‌టైమ్ లాక్
విక్టరీ వెంకటేష్(venkatesh), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం(Aadarsa kutumabam) రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే వెంకటేష్‌కు, తనదైన స్క్రీన్‌ప్లే, సంభాషణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ తోడవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 30న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా సినిమా రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేయడంతో రిలీజ్ కు సంబంధించిన కీలక పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి.
సుమారు 2 గంటల 29 నిమిషాల నిడివితో ఆదర్శ కుటుంబం థియేటర్లలో సందడి చేయనుంది. మొత్తం 149 నిమిషాల రన్టైమ్తో రూపొందిన ఈ సినిమా కథనంలో వేగం, వినోదానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. కామెడీతో పాటు ఎమోషన్స్, ఉత్కంఠభరిత సీన్స్ కథలో భాగం కానున్నాయి. పండుగ సీజన్లో రిలీజవుతున్న నేపథ్యంలో ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వెంకటేష్, త్రివిక్రమ్ కలయిక స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్(harika and hassinee creations) పతాకంపై ఎస్. రాధాకృష్ణ(S Radhakrishna) ఈ సినిమాను నిర్మించగా, శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా నటించింది. నివేదా పేతురాజ్(Nivetha pethuraj), నారా రోహిత్(nara rohith), పూజిత పొన్నాడ(Poojitha ponnada), రావు రమేష్(rao ramesh), రాజా ప్రజ్వల్(raja prajwal), దేవయాని శర్మ(Devayani sharma), బ్రహ్మాజీ(Brahmaji) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్. తమన్(S thaman) సంగీతం అందించిన ఈ మూవీ దీపావళి బరిలో దిగుతున్న ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.








