వారణాసి ఓటీటీ డీల్‌పై సందిగ్ధం.. రాజమౌళి టీమ్ కీలక నిర్ణయం!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి(Varanasi) సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్నేషనల్ రేంజ్ కథాంశం, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ బిజినెస్ చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ఓటీటీ సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లు నిర్మాతల అంచనాలకు అనుగుణంగా లేవనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులే కాకుండా, ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ విక్రయంపైనా మేకర్స్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. దీంతో వచ్చిన ఆఫర్లను వెంటనే ఫిక్స్ చేయకుండా, మార్కెట్ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్స్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి అఫీషియల్ వివరాలను వెల్లడించలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj sukumaran), ప్రకాష్ రాజ్(prakash raj) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటీటీ సహా ఇతర హక్కుల విషయంలో నిర్మాతలు ఎలాంటి డీల్స్ కుదుర్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.








