ఎస్ కృష్ణ, ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ ‘హై’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్
బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేసి, పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు కో-రైటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడంతో పాటు కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఎమోషన్స్, డ్రామా, హై ఎనర్జీ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘హై’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్, రేడియేటింగ్ ప్యాటర్న్స్, టర్కాయిస్ కలర్ స్ట్రీక్స్తో పోస్టర్‌కు డైనమిక్ లుక్ ఇచ్చారు. కామిక్ బుక్ స్టైల్లో రూపొందించిన ఈ పోస్టర్ యూత్‌ఫుల్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తోంది.
పోస్టర్లో ప్రధాన పాత్రధారుల విభిన్నమైన ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుల్లిరాజు ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో ముందుకు చేయి చాపి కనిపిస్తున్నారు. ఎడమవైపు పల్లవి దొర, అనన్య శర్మ తమ విభిన్నమైన హావభావాలతో ఆకట్టుకుంటున్నారు. కుడివైపు కృష్ణ కమల్, సాయి కృష్ణ ప్రత్యేకమైన పోజుల్లో కనిపిస్తుండగా, కుడివైపున ఎస్ కృష్ణ కనిపిస్తున్నారు. కథలోని పాత్రల స్వభావాలు, యూత్‌ఫుల్ ఎనర్జీ, విభిన్నమైన కథనాన్ని ఈ పోస్టర్ చూపిస్తోంది.
‘హై’ సినిమా ప్రతి వ్యక్తి తన జీవితంలో కోరుకునే ఆనందం, ఉత్సాహం వెనుక ఉన్న భావోద్వేగ, మానసిక, నైతిక సంఘర్షణలను ఆవిష్కరించనుంది. ఒక పాత్ర ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే, మరో పాత్ర డబ్బు, మద్యం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటుంది. మరో యువతి తన ఆత్మగౌరవాన్ని తిరిగి సాధించుకోవడం ద్వారా తనలోని బలాన్ని గుర్తిస్తుంది. అదే సమయంలో ఆమె ప్రేమికుడు బెట్టింగ్స్‌లో థ్రిల్‌ను వెతుక్కుంటాడు. ఇలా పరస్పరం అనుసంధానమైన కథల ద్వారా, డేంజర్ మార్గాలను ఎంచుకోవడం కంటే సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనే జీవితానికి నిజమైన ఆనందం లభిస్తుందనే విషయాన్ని ఈ సినిమా ప్రజెంట్ చేయబోతోంది.
గతంలో విడుదల చేసిన టీజర్లో ఎస్ కృష్ణ విభిన్నమైన స్టొరీ టెల్లింగ్, నటీనటుల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జెన్ జెడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వికాస్ బడిసా సంగీతం సమకూరుస్తున్నారు. జీఆర్కే శరణ్ రావుల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వి వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.
నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్లను మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.








