ప్రేమకథతో వస్తున్న స్టార్ బాయ్!
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddhu jonnalagadda) మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు కెరీర్లో 10వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు హైదరాబాద్‌లో నేడు ఘనంగా శ్రీకారం చుట్టారు. సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), బన్నీ వాస్ వర్క్స్(Bunny Vaas Works) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మోహన్ బి(Mohan B) దర్శకత్వం వహించనున్నారు. ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తబితా సుకుమార్(Thabitha Sukumar) ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా(Buchibabu sana) సినిమా స్క్రిప్ట్‌ను అందించగా, అల్లు అరవింద్(Allu Aravind) సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆవిష్కరించారు. ధీరజ్ మొగిలినేని(Dheeraj mogilineni), వంశీ నందిపాటి(Vamsi Nandipati) తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నయన్ సారిక(Nayan sarika) హీరోయిన్ గా నటించనున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. టైటిల్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.







