ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలి: కవిత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్, బీజేపీ( BJP)కి బుద్ధి చెప్పాలని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud), ఆకాశ్ కొల్లూరు (Akash Kollur) ఎన్నికల ప్రచార వాహనాలను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామని చెప్పారు. ఎన్నికల సంఘం వద్ద టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా నమోదైందని, పార్టీ పై అభ్యంతరాలు, సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారని, 10 లక్షల మంది కూడా ఓటు నమోదు చేసుకోలేదని తెలిపారు.







