తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు భారీగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ (Future City)లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ (Global Summit)-2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రతినిధులు ప్రభుత్వ అధికారిక పోర్టల్ invite-itgs2026.telanagana.gov.in ద్వారా ఆన్లైన్ (Online)లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పోర్టల్‌ను తెరవడం, వివరాలను నమోదు చేయడం, నిర్ధారణ పొందడం, ఇలా మూడు దశల్లో పూర్తవుతుంది. పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు (Industrialists),స్టార్టప్ సంస్థలు అధికారిక పోర్టల్‌లో ముందుగానే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.







