భక్తి, సంప్రదాయాలను చాటుతూ రంగోళీ పోటీలు… ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ శాన్ ఆంటోనియో – (TASA) కార్యకర్తలు దీపావళి SA రంగోలీ పోటీలో ఎంపికయ్యారు. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి రంగోలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ రంగోలీ కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను, కృషిని జోడిస్తూ, వారు రంగోలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రకాశవంతమైన రంగోలీలకు అందమైన రంగులు వేశారు. అలాగే వీటిని పూలతో కూడా అలంకరించారు. ఈ రంగోలీలకు భక్తిని కూడా జోడించి, ఎంతో అభిరుచితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగోళీ పోటీలో కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, వారందరికీ TASA ధన్యవాదాలు ప్రకటించింది. రంగోలీ ద్వారా హిందూ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు.







