భూముల వేలాన్ని అడ్డుకుంటాం : ఎంపీ ఈటల
ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన హౌసింగ్ బోర్డు భూముల (Housing Board lands)ను ప్రభుత్వం విక్రయించడంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల విక్రయాలను నిరసిస్తూ బీజేపీ (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. కూకట్పల్లి (Kukatpally)లో జనసాంద్రత అధికంగా ఉన్నందున పార్కులు, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం భూముల కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూములను వేలం వేయడం సరికాదన్నారు. రైతుల నుంచి సేకరించిన ట్రాక్ పార్కు స్థలాన్ని సైతం విక్రయానికి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 12న జరగనున్న భూముల వేలాన్ని కాలనీవాసులతో కలసి అడ్డుకుంటామని స్పష్టం చేశారు.







