MSN రియల్టీ సారథ్యంలో MATA సభ్యుల కోసం ‘‘రియల్టీ’’ వెబినార్
ప్రస్తుతం అందరూ విలాసవంతమైన జీవితాన్నే కోరుకుంటున్నారు. మరీ విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువ శాతం ఇళ్ల విషయంలో వెతుక్కుంటారు. అందుకే రకరకాల డిజైన్లు, ఇంటీరియర్ డిజైన్లకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ MSN రియల్టీ, ‘మెట్రో అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) సభ్యుల కోసం ఒక ప్రత్యేకమైన వెబినార్‌ను నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతమైన నియోపాలిస్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘ONE by MSN’ ప్రాజెక్ట్‌తో పాటు, భవిష్యత్తులో రాబోయే నూతన ప్రాజెక్ట్ (The Next Chapter) యొక్క మొదటి లుక్‌ను (Exclusive First Look) ఈ వేదికగా పరిచయం చేయనున్నారు.
నవంబర్ 14 వ తేదీన ఈ వెబినార్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ వెబినార్ కి కేవలం MATA సభ్యులకు మాత్రమే ఆహ్వానం వుంటుందని సంస్థ సభ్యులు స్పష్టం చేశారు. దీనికి పరిమితంగానే సీట్లు వున్నాయని, అందుకే ఆసక్తి వున్న వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం అభిషేక్ జైన్ (91 91543 93049) ను సంప్రదించాలి.







