మొదటి భారతీయ అమెరికన్ సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర నెలకొల్పిన ప్రియా సుందరేశన్
భారతీయ అమెరికన్ ప్రియ సుందరేశన్ ఏరిజోనా సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె ఓ చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాలలో తొలిసారిగా డెమోక్రాట్లు సెనేట్ సభను, గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం కీలకమే.
దేశంలో ఓ రాష్ట్ర సెనేట్ కి నాయకత్వం వహించిన మొట్ట మొదటి భారతీయ అమెరికన్ గా ప్రియా సుందరేశన్ చరిత్ర నెలకొల్పారు. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికలలో పార్టీ చారిత్రాత్మక విజయాలు సాధించిన అనంతరం సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు.
మూడు పర్యాయాలు రాష్ట్ర సెనేటర్‌గా పనిచేసిన సుందరేశన్, ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న ఈ సభలో మైనారిటీ నాయకురాలిగా ఉన్నారు. జనవరిలో డెమోక్రాట్లు నియంత్రణ చేపట్టినప్పుడు, ఆమె ఎన్నికతో రాష్ట్ర సెనేట్‌కు సారథ్యం వహించనున్నారు. ఇది పార్టీ శాసనపరమైన అజెండాను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
“మైనారిటీ నాయకురాలిగా నా పదవీకాలంలో మనం కలిసి సాధించిన విజయాల పట్ల నేను గర్విస్తున్నాను. ఇప్పుడు, తదుపరి అధ్యాయంలో మనకు నాయకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరిజోనా ప్రజలు విభజన వాదాన్ని తిరస్కరించి, కొత్త దిశను ఎంచుకున్నారు. ప్రజల రాజకీయ విశ్వాసాలకు భిన్నంగా, సమస్యలపై దృష్టి సారిస్తానని హామీ ఇస్తున్నాను. దైనందిన జీవితంలో కావాల్సిన అవసరాలను కచ్చితంగా చూస్తాను. దీని ద్వారా ప్రతి రోజూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతా. దీని అర్థం శ్రామిక కుటుంబాలకు ఖర్చులను తగ్గించడం, మన సమాజాలను సురక్షితంగా ఉంచడం మరియు అరిజోనాలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాన్ని కల్పించడం. మీరు ఎక్కడ నివసిస్తున్నా, ఎవరికి ఓటు వేసినా, మీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” అని ప్రకటించారు.
సుందరేశన్ ఈ ఎన్నికల ఫలితాన్ని రిపబ్లికన్ పార్టీ రాజకీయ దిశకు తిరస్కారంగా అభివర్ణించారు. “రిపబ్లికన్లు మన దేశంలో ప్రోత్సహిస్తున్న MAGA తీవ్రవాదానికి ఇది ఒక తిరస్కరణ” అని ఆమె పేర్కొన్నారు.
సుందరేశన్ నేపథ్యమిదీ…
టక్సన్‌లో జన్మించిన సుందరేశన్, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం మరియు సహజ వనరుల అర్థశాస్త్రం వంటి రంగాలలో విద్యా మరియు వృత్తిపరమైన నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె 2006లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2011లో, ఆమె అరిజోనా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ మరియు natural resource economics లో మాస్టర్ డిగ్రీని సంపాదించారు.
రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు, ఆమె అరిజోనా విశ్వవిద్యాలయంలో సహజ వనరుల చట్టాన్ని బోధించారు మరియు సుస్థిర వనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్‌తో కలిసి పనిచేశారు.పర్యావరణ విధానం మరియు చట్టంలో ఆమెకున్న అనుభవం, సహజ వనరులు మరియు సుస్థిరతకు సంబంధించిన సమస్యల విషయంలో శాస్త్రీయ ఆధారిత విధాన రూపకల్పన మరియు సాక్ష్యాధారిత పద్ధతులపై ఆమె దృష్టి పెట్టడానికి దోహదపడింది. ఆమె ఓటింగ్ హక్కులు, ఓటర్ల రక్షణ మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలలో కూడా పాలుపంచుకున్నారు.







