మా పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని తీరుస్తాం : అంబటి రాంబాబు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ని సరిగా నిర్వహించలేదని, వైసీపీ (YSRCP) వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. ఇవన్నీ బాకీలే. మా పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని తీరుస్తాం. మేం మంచి వాళ్లమైనా మా నాయకులు ఒప్పుకోరుగా, బాకీలు తీర్చాల్సిందేనంటూ మాపై ఒత్తిడి తెస్తారు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన కేసులో గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ( Lella Appireddy)ని ములాఖాత్‌లో అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం (Talasila Raghuram), వజ్రబాబు ( Vajrababu) కలిసి పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో రాంబాబు మాట్లాడారు. బ్యాలట్ బాక్సుల్ని కాపాడేందుకు వెళితే అప్పిరెడ్డి లాఠీఛార్జి చేశారని, కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు.







